చీపురుపల్లి నుంచి వైకాపా అభ్యర్థిగా నేనే పోటీ చేస్తానన్న బొత్స సత్యనారాయణ
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
గరివిడిలో శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి వైకాపా అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని తెలిపారు. తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండి రాజ్యసభకు వెళ్తానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొంటూ, ఎప్పటిలాగే కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. ఒక సంధానకర్త వెళ్లిపోయినా నష్టం లేదని, ఇక నుంచి తన పిల్లలు అనూష, సందీప్‌తో పాటు నాలుగు మండలాల నేతలే తన సంధానకర్తలని ఆయన స్పష్టం చేశారు.