తుమ్మలగుంటలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు
స్థలం: తిరుపతి రూరల్
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వేద పండితుల పర్యవేక్షణలో స్వామివారి వాహనాలు, ఆలయ ప్రాంగణాన్ని శాస్త్రోక్తంగా శుద్ధి చేశారు.
భక్తుల కోసం హారతి పాయింట్లలో చలువ పందిర్లు వేయడంతో పాటు, ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అధిక మాసం నేపథ్యంలో రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నందున, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేపట్టారు.