తెలంగాణలో ఎన్నికలు కాని 58 గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికలు జరగని 58 గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఆర్థిక శాఖ ద్వారా నిధులను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని నేరుగా ఆయా గ్రామ పంచాయతీల అధికారిక బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ, అత్యవసర పనులకు నిధుల కొరత రాకుండా ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.