టాలీవుడ్ విమర్శలపై పాయల్ రాజ్పుత్ ఆగ్రహం: రాధికా ఆప్టే వ్యాఖ్యలకు కౌంటర్

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

తెలుగు చిత్ర పరిశ్రమపై నటి రాధికా ఆప్టే చేసిన విమర్శలను నటి పాయల్ రాజ్పుత్ తీవ్రంగా ఖండించారు. కెరీర్ కు పునాది వేసి గుర్తింపు తెచ్చిన టాలీవుడ్ను తప్పుపట్టడం కృతజ్ఞత లేని చర్య అని ఆమె మండిపడ్డారు. గత ఎనిమిదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నానని, కష్టకాలంలో అండగా నిలిచిన పరిశ్రమకు ఎప్పటికీ మద్దతుగా నిలుస్తానని పాయల్ రాజ్పుత్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు.