కోల్కతాలో దారుణం: యువకుడిని బట్టలు విప్పించి వీధుల్లో ఊరేగించిన బాలిక కుటుంబ సభ్యులు

రిపోర్టర్: మహేష్ స్థలం: కోల్‌కతా

కోల్కతాలోని సరసునా ప్రాంతంలో జరిగిన అత్యంత అమానుష ఘటనలో మైనర్ బాలిక కుటుంబ సభ్యులు ఓ యువకుడితో పాటు ఆయన తండ్రిని, మరో స్నేహితుడిని తీవ్రంగా కొట్టి బట్టలు విప్పించి వీధుల్లో నడిపించారని స్థానికులు మరియు పోలీసులు వెల్లడించారు. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో నిందితులు తుపాకులతో బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు నిందితుల ఇళ్లను ధ్వంసం చేయగా, పోలీసులు ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు.