సినిమాల ఎంపికపై నటి అనుపమ పరమేశ్వరన్ కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

సినిమాలను ఎంపిక చేసుకునే విషయంలో దర్శకుడి అభిరుచే తనకు అత్యంత ముఖ్యమని ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, కథ ఎంత ముఖ్యమో దాన్ని తెరకెక్కించే విధానం కూడా అంతే ముఖ్యం అని స్పష్టం చేశారు. కొత్తవారితో సన్నిహితంగా ఉండే సన్నివేశాలు చేయడంలో తాను ఇబ్బంది పడతానని తెలిపారు. దర్శకుడు తనతో ట్యూన్ అయితేనే సినిమాలను అంగీకరిస్తానని ఆమె పేర్కొన్నారు.