ఆత్మకూరులో ఉచిత వైద్య శిబిరంతో ఆయుర్వేద ఆరోగ్య పరిరక్షణ

రిపోర్టర్: Raju Reporter స్థలం: ఆత్మకూర్

జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మకూర్ మండల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. అనంతరం ధన్వంతరి భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.