టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభం.. ఫిట్‌నెస్ సాధించిన బుమ్రా, నితీష్ రెడ్డి

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించిన టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి తిరిగొచ్చారు. హర్షిత్ రాణా గాయం కారణంగా వైదొలగగా యశ్ ఠాకూర్ ఎంపికయ్యాడు. ఆటగాళ్ల తరచూ గాయాలపాలవుతుండటంతో బీసీసీఐ ఫిజియో కమేష్ జైన్‌ను తొలగించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 13న జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతుందని డీడీసీఏ స్పష్టం చేసింది.