దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

బీఆర్ఎస్ పార్టీ బీఫామ్‌పై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనపై దాఖలైన పిటిషన్లపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.