గణేష్ పండళ్లకు ఉచిత విద్యుత్ అందించనున్న ఏపీ ప్రభుత్వం

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ పండళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పండుగ రోజుల్లో విద్యుత్ ఛార్జీల భారం లేకుండా భక్తులు, ఉత్సవ కమిటీలకు అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం ఈ భారీ పండుగ కానుకను అందించింది. ఈ నిర్ణయంతో ఉత్సవ నిర్వాహకులకు పెద్దఎత్తున ఉపశమనం లభించనుంది.