బైండోవర్ ఉల్లంఘించిన రౌడీ షీటర్ కు జరిమానా బాటింపు
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
బైండోవర్ నిబంధనలను అతిక్రమించిన శ్రీరాంపూర్ అరుణక్క నగర్‌కు చెందిన రౌడీ షీటర్ జలంపల్లి సందీప్‌ను పోలీసులు గురువారం మంచిర్యాల ఆర్డీఓ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా బైండోవర్ షరతుల ప్రకారం లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో ఆరు నెలల జైలు శిక్ష తప్పదని ఆర్డీఓ నోటీసు జారీ చేసినట్లు సీఐ ఆకుల అశోక్ వెల్లడించారు. ఈ కఠిన చర్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.