విజయదశమి వేడుకలు: ఇంటిగ్రేటెడ్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజలు నిర్వహించిన ఎస్పీ
రిపోర్టర్: మహేష్
స్థలం: తిరుపతి
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంటిగ్రేటెడ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తొలిసారిగా విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు Tirupati Police వెల్లడించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు స్వయంగా ఆయుధ పూజలు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది అందరికీ ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్సాహంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు మరియు స్థానిక సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.