ఎస్డీఆర్ఎఫ్లోకి కడావర్ జాగిలాల ప్రవేశమంటూ హోం మంత్రి అనిత ప్రకటన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర విపత్తు స్పందన దళంలోకి కడావర్ డిటెక్షన్ జాగిలాలను ప్రవేశపెడుతున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్లో పోలీసు జాగిలాలు, వాటి హ్యాండ్లర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముప్పై ఆరు జాగిలాలకు పది నెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి విధులకు సిద్ధం చేశారు. వరదలు, భూకంపాలు సంభవించిన సమయాల్లో శిథిలాల్లో చిక్కుపోయిన వారిని కాపాడటంలో, గల్లంతైన వారిని గుర్తించటంలో ఇవి కీలకంగా పనిచేస్తాయని తెలిపారు.