పలాస మేధర వీధిలో ఇళ్లలోకి చేరిన మురుగునీటితో స్థానికుల అల్లాకల్లోలం

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మేధర వీధిలో మంగళవారం కురిసిన ఎడతెరిపిలేని వర్షానికి ఇళ్లలోకి వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు సృష్టించింది. నీరు బయటకు వెళ్లే దారి లేక రోడ్లపై నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వర్షాకాలంలోనూ ఇదే సమస్య పునరావృతమవుతోందని వాపోయారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు.