రూపాయిల పది వేల బడ్జెట్ తో దేశ యాత్ర: ఆరు రాష్ట్రాలు చుట్టేసిన యువతి

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

కేవలం పది వేల రూపాయల బడ్జెట్ తో దేశమంతా చుట్టేయాలనే సాహస యాత్రకు శ్రీకారం చుట్టానని ఇన్ స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ ఫ్లయింగ్ ఫిష్ వెల్లడించారు. ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్ లో పర్యటించి కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేశానని ఆమె తెలిపారు. రైల్వే స్టేషన్లలో గడుపుతూ, ఉచిత ఆహారం తీసుకుంటూ ఈ వినూత్న సవాల్ ను ఎదుర్కొంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సాహస యాత్రపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.