చీకటి గుప్పిట్ లో పొదలకూరు డిపో ప్రయాణికుల తీవ్ర అవస్థలు
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: పొదలకూరు
పొదలకూరు ఆర్టీసీ డిపోలో కనీస వసతులు కరువయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఇన్వెర్టర్ సదుపాయం కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకట్లోనే కండక్టర్లు సెల్ ఫోన్ టార్చి లైట్ల సహాయంతో రిజిస్టర్లలో సంతకాలు చేయాల్సి వస్తోంది. సీసీ కెమెరాలు లేకపోవడం, వర్షాకాలంలో నీరు నిలవడం వంటి సమస్యలపై వెంటనే స్పందించి సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.