నా యాసపై విమర్శలను ఎదుర్కొన్నా: నటి రష్మిక మందన్న స్పష్టీకరణ
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
తన సినీ ప్రయాణంలో భాష మరియు యాసపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని ప్రముఖ నటి రష్మిక మందన్న స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండతో కలిసి ఇటీవల ఓ ప్రముఖ టాక్ షోలో పాల్గొన్న ఆమె, తనపై వస్తున్న ట్రోల్స్‌కు గట్టిగా సమాధానం చెప్పారు. దక్షిణాది అమ్మాయి అయినందున తన మాటల్లో ప్రాంతీయ యాస కనిపిస్తుందని, భిన్న భాషల్లో సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పడం ఎంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు.