అమెరికాలో గుండెపోటుతో సీపీఎం నేత యంఏ గఫూర్ కుమారుడు మృతి
రిపోర్టర్: రాము
స్థలం: కర్నూలు
అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత యంఏ గఫూర్ కుమారుడు పీవీ కిరణ్ గుండెపోటుతో నిద్రలోనే మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉన్న కిరణ్ అక్టోబర్ మొదటి తేదీన అనారోగ్యానికి గురయ్యారని, అపార్ట్మెంట్ మేనేజర్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని గఫూర్ ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.