నిరుద్యోగ సమస్యలపై కల్వకుర్తిలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోరుతూ కల్వకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో వందలాది మంది యువకులు పాల్గొన్నారు.

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. యూత్ డిక్లరేషన్ హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరుతూ పట్టణంలో నినాదాలతో హోరెత్తించారు. ఈ భారీ ప్రదర్శనతో కల్వకుర్తి గులాబీ మయమైంది.