భార్య గొంతు కోసిన భర్త అరెస్ట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఢిల్లీ

భార్యపై బ్లేడ్‌తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సుందర్ నగరి ప్రాంతంలో వివాహేతర సంబంధం కారణంగా జరిగిన కుటుంబ గొడవలో మజిద్ హుస్సేన్ అనే వ్యక్తి తన భార్య సాజియా గొంతుపై బ్లేడ్‌తో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలను ఆసుపత్రికి తరలించగా, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.