ది ప్యారడైజ్ చిత్రంలో నాని తల్లిగా మెప్పించిన లావణ్య

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ చిత్రంలో యువ నటి లావణ్య సహుకర కీలక పాత్రలో నటించారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో నాని తల్లి సమ్మక్క పాత్రకు సంబంధించిన యువ దశలో లావణ్య నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. గతంలో పలు చిత్రాల్లో నటించిన ఆమె ఈ సినిమాతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు.