ఆదాయపు పన్ను రీసెస్మెంట్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు: సభర్వాల్లకు గట్టి షాక్

రిపోర్టర్: విజయ్ స్థలం: New Delhi

మాజీ సీజేఐ వైకే సభర్వాల్ కుమారులు చేతన్ సభర్వాల్, నితిన్ సభర్వాల్ ల ఆదాయపు పన్ను రీసెస్మెంట్ కు సంబంధించి దాఖలైన అప్పీల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆదాయం మదింపు నుంచి తప్పించుకుంటే తిరిగి విచారించే అధికారం ఐటీ శాఖకు ఉందని జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 2015లో జారీ చేసిన నోటీసులు పూర్తిగా చట్టబద్ధమైనవేనని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది.