సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సురేష్
స్థలం: Andhra Pradesh
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తాను రహస్యంగా సమావేశం కాబోతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైన కట్టుకథలని ఆమె కొట్టిపారేశారు. కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహానికి అన్ని పార్టీల అధినేతలను ఆహ్వానించినట్లే జగన్ను కూడా పిలుస్తానని స్పష్టం చేశారు.