అరుదైన నాణేల సేకరణ: రెండొత్సరాల నాటి నాణేలు భద్రపరిచిన అజయ్ కుమార్

రిపోర్టర్: మహేష్ స్థలం: గుణ

మధ్యప్రదేశ్లోని గుణ నగరానికి చెందిన అజయ్ కుమార్ జైన్ వద్ద సుమారు రెండు వేల సంవత్సరాల నాటి వేయి అరుదైన పురాతన నాణేలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ నాణేలు మౌర్య చక్రవర్తులు, కుషాణ సామ్రాజ్యం, దిల్లీ సుల్తానులు, మొఘలుల కాలానికి చెందినవని ఆయన వెల్లడించారు. నాణేల తయారీ శైలి, వాడిన లోహం ఆధారంగా వాటి విలువను నిర్ణయిస్తామని అజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి నాణెంపై ఆయా రాజ్యాల కాలం నాటి ప్రకృతి, మతపరమైన ప్రత్యేక చిహ్నాలు ముద్రించినట్లు ఆయన వివరించారు.