వైకల్య పింఛను కోసం అధికారుల చుట్టూ అభాగ్యులైన దంపతుల అష్టకష్టాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరుకు చెందిన అయ్యప్ప, అనూష దంపతులు ముగ్గురు సంతానంలో ఇద్దరు పిల్లలను అనారోగ్యంతో కోల్పోయారు. పుట్టుకతోనే కాళ్లు, చేతులు చచ్చుబడి మంచానికే పరిమితమైన అయిదేళ్ల మూడో బిడ్డ దక్షిత్కు తొంభై శాతం వైకల్యం ఉన్నా పింఛను రాలేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ దంపతులు రోదిస్తున్నారు.