జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణ పోలీసులు

రిపోర్టర్: సతీష్ స్థలం: ఢిల్లీ

మాదకద్రవ్యాల నిరోధక చర్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 7 కీలక ప్రమాణాలలో తెలంగాణ పోలీస్ శాఖ అసాధారణ ప్రతిభ కనబరిచింది. ఏకంగా 80 శాతానికి పైగా స్కోరు సాధించి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిల్య ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.