జగనన్న కాలనీల ప్లాట్ల మార్పుపై కేబినెట్ సబ్కమిటీ ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణయం

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం తాజా పరిణామాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. జగనన్న కాలనీల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లకు సంబంధించి కొత్త కేటాయింపులు చేపట్టేందుకు కేబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇల్లు కట్టుకునేందుకు ఆసక్తి లేని లబ్ధిదారులకు వేరే ప్రాంతంలో ప్లాట్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను శ్రద్ధగా విని సత్వరమే పరిష్కరించాలని మంత్రులకు సీఎం సూచించారు.