మేఘాలయలో బీజేపీలోకి ఎనిమిది మంది యూడీపీ ఎమ్మెల్యేల చేరిక

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

మేఘాలయ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అధికార కూటమి భాగస్వామి అయిన యూడీపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు న్యూఢిల్లీలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, ఎంపీ సంబిత్ పాత్ర సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి విధానాలకు ఆకర్షితులై వీరు కాషాయ కండువా కప్పుకున్నట్లు నేతలు తెలిపారు. ఈ పరిణామంతో అసెంబ్లీలో బీజేపీ బలం రెండు నుంచి పదికి పెరిగి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.