ఇంగ్లండ్ జట్టులోకి కెవిన్ పీటర్సన్ రీఎంట్రీపై బ్రెండన్ మెకల్లమ్ స్పందన
రిపోర్టర్: శివ
స్థలం: World
ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్‌ను జట్టు మెంటార్‌గా నియమించడం తన ఆలోచనే అని వైట్-బాల్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్పష్టం చేశారు. గతంలో తనపై, జట్టుపై పీటర్సన్ విమర్శలు చేసినప్పటికీ తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. జట్టు అభివృద్ధి కోసం ఆయన అనుభవం ఉపయోగపడుతుందని, పీటర్సన్ రాకతో జట్టులో నూతనోత్సాహం నిండిందని మెకల్లమ్ పేర్కొన్నారు.