సంగీతం, కథలతో ప్రత్యేక అనుభూతి: ములాఖత్ ఖుద్ సే ప్రదర్శన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

సంగీతం మరియు కథల కలయికతో ప్రేక్షకులకు భావోద్వేగాల అనుభూతిని పంచేలా ములాఖత్ ఖుద్ సే లైవ్ షోను రూపొందించినట్లు నటుడు విపుల్ రాయ్ వెల్లడించారు. ఈ ప్రదర్శన ద్వారా ప్రజలు తమ జ్ఞాపకాలను నెమరువేసుకోవడంతో పాటు మానసిక ప్రశాంతతను పొందవచ్చని ఆయన తెలిపారు. బిజీ లైఫ్లో భావోద్వేగాలకు సమయం కేటాయించడం ఎంతో ముఖ్యమని విపుల్ రాయ్ స్పష్టం చేస్తూ, ఈ సరికొత్త షో ద్వారా సరికొత్త అనుభూతిని అందిస్తున్నట్లు తెలిపారు.