తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే: నేలకొరిగిన పంట పరిశీలన
రిపోర్టర్: గోపి
స్థలం: Andhra Pradesh
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారని CMO Andhra Pradesh వెల్లడించారు. నర్సాపురం మండలం కొత్తనవరసపురంలో నీట మునిగిన వరిపొలాలను పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు. మొగల్తూరు మండలం మాట్రేవులో తుఫాన్కు దెబ్బతిన్న కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలించి నష్టపోయిన రైతన్నలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.