నర్సంపేటలో విద్యుత్ కోతలు.. అల్లాడుతున్న వృద్ధులు, చిన్నారులు

రిపోర్టర్: Rajashekar స్థలం: నర్సంపేట

నర్సంపేటలో విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి సుమారు గంటన్నరపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వృద్ధులు, చిన్నారులు దోమలతో తీవ్ర అవస్థలు పడ్డారు.

ముందస్తు సమాచారం లేకుండా, సమయపాలన లేకుండా కోతలు విధించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై అధికారులకు ఫోన్ చేసినా ఎటువంటి స్పందన లేదని, వెంటనే విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.