ఈ ఏడాది డిసెంబర్లో ఘనంగా నంది అవార్డుల ప్రదానోత్సవం
రిపోర్టర్: సురేష్
స్థలం: Amaravati
ఏపీలో గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని ఈ ఏడాది డిసెంబర్లో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం మేరకు 2012 నుంచి 2016 వరకు ప్రకటించిన అవార్డులతో పాటు, 2017 నుంచి 2024 వరకు ఏటా నాలుగు అవార్డుల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. అమరావతి లేదా విజయవాడలో ఫిల్మ్ అవార్డులు, తిరుపతిలో టీవీ అవార్డుల వేడుకలు నిర్వహించనున్నారు.