బీసీ భవన నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలి

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు జిల్లాలో బీసీ భవన్ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని కోరుతూ ఏపీ స్టూడెంట్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కూరపాటి గోపాల్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

రెండేళ్ల కిందటే విరాళాలు సమకూరినప్పటికీ అధికారులు పనులు ప్రారంభించలేదని మండిపడ్డారు. మంత్రి నారాయణ కోటి రూపాయలు, ఎంపీ బీద మస్తాన్ రావు కోటీ పాతిక లక్షల రూపాయలు విరాళం ఇచ్చినా జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.