హై స్పీడ్ రైలు భూసేకరణపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
హై స్పీడ్ రైలు ప్రాజెక్టుల పేరిట రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని, తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేసినట్లు Telugu Scribe వెల్లడించారు. రైల్వే శాఖ అనుమతి లేకుండా జరిగే ఏ భూసేకరణ చర్యలనైనా చట్టపరంగా ఇల్లీగల్‌గా పరిగణిస్తామని ఆయన తేల్చిచెప్పారు. కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకుండా రాష్ట్రాలు ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.