అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం: పెట్రోల్ పోసుకుని కుటుంబం ఆత్మహత్యాయత్నం

రిపోర్టర్: రాము స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ గ్రామంలో కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. చల్లా ఈశ్వరరావు, నాగమణి, వరహాలమ్మ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. స్థానికులు తలుపులు పగలగొట్టి మంటలు ఆర్పగా తీవ్ర గాయాలైన బాధితులను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.