అభివృద్ధిని అడ్డుకుంటున్న కరుణాకర్ రెడ్డిపై గొల్ల నరసింహ యాదవ్ ధ్వజమెత్తారు
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
తిరుపతిలో అభివృద్ధిని అడ్డుకునేలా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటనలు చేయడం తగదని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు గొల్ల నరసింహ యాదవ్ మండిపడ్డారు. ఓబ్రాయ్ హోటల్ భూకేటాయింపులపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వైసీపీ నేతల కుట్రలను తిరుపతి ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.