నర్సీపట్నం గడ్డపై చారిత్రాత్మక విజయంతో కదంతొక్కిన పసుపు శ్రేణులు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ ఘన విజయం సాధించిందని రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ వెల్లడించారు. నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలంతా ఒకే వైపు నిలిచి కూటమికి పట్టం కట్టారని ఆయన స్పష్టం చేశారు. నర్సీపట్నం అడ్డా ఇప్పుడు పూర్తిగా తెలుగుదేశం గడ్డగా మారిపోయిందని తెలిపారు. అభివృద్ధి ధ్యేయంగా ప్రత్యేక విజన్ డాక్యుమెంట్తో ముందుకు వెళ్తామని ఎంపీ విజయ్ స్పష్టం చేశారు.