తెలంగాణలో భారీగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

తెలంగాణ వైద్య విద్యారంగంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎంబీబీఎస్ సీట్లు భారీగా పెరిగాయి. నేషనల్ మెడికల్ కమిషన్ నూతనంగా 1,010 సీట్లకు అనుమతులు మంజూరు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం సీట్ల సంఖ్య 10,450కి చేరింది. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో 4,400 సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లో 6,050 సీట్లు అందుబాటులో ఉన్నాయి. జాతీయ స్థాయిలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది.