బెంగళూరులో ప్రేమ వివాహం చేసుకున్న యువతి కిడ్నాప్ యత్నం భగ్నం

రిపోర్టర్: శివ స్థలం: బెంగళూరు

బెంగళూరులోని అగ్రహార దశరహళ్లిలో ప్రేమ వివాహం చేసుకున్న పూజా అనే యువతిని ఆమె కుటుంబ సభ్యులు పంపిన వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పారిపోతున్న సమయంలో కారు పలు బైకులను ఢీకొనడంతో ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు కారును అడ్డుకుని నిందితులను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించగా, తీవ్ర గాయాలైన జయలక్ష్మి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.