యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై మోర్నే మోర్కెల్ ప్రశంసలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: న్యూఢిల్లీ
భారత యువ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని అత్యంత జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉందని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ పేర్కొన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించే అద్భుతమైన సత్తా అతడి వద్ద ఉందని, జట్టులో స్పష్టమైన బాధ్యతలు అప్పగిస్తూ నిరంతరం అవకాశాలు ఇస్తే అతడు మ్యాచ్ విన్నర్ గా ఎదుగుతాడని ఆయన తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ నితీష్ బౌలింగ్ చేసిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని మోర్కెల్ వెల్లడించారు.