సిరికొండలో వాహనాల తనిఖీ నిర్వహించిన ఎస్సై రామకృష్ణ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సిరికొండ
నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని లొంక చౌరస్తా వద్ద ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అవసరమైన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.