ప్రత్యేక అవసరాల పిల్లల సేవలకు ఇండియన్ హ్యుమానిటేరియన్ అవార్డు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సాధికారతకు సమగ్ర శిక్ష ద్వారా చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు అరుదైన గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావుకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఇండియన్ హ్యుమానిటేరియన్ అవార్డును ప్రదానం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పురస్కారం ప్రత్యేక అవసరాల పిల్లల సేవలో అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బంది, తల్లిదండ్రులందరికీ దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు.