కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో గ్లైసిల్ గడ్డి మందు స్వాధీనం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కాగజ్ నగర్
కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నిషేధిత గ్లైసిల్ గడ్డి మందు పట్టుబడింది. ప్లాట్ఫామ్ నంబర్-2 వద్ద రామగిరి ఎక్స్ప్రెస్లో ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో భాగంగా 81 గడ్డి మందు ప్యాకెట్లతో పాటు 5 లీటర్ల సామర్థ్యం గల 5 క్యాన్లు, 1 లీటర్ సామర్థ్యం గల మరో 5 క్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ అక్రమ సరుకును తదుపరి చర్యల నిమిత్తం వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు.