మహారాష్ట్రలో దారుణం: గులాబ్ జామున్ గిన్నెలో ఈదుతున్న ఎలుక కలకలం

రిపోర్టర్: మహేష్ స్థలం: Bhiwandi

మహారాష్ట్రలోని భివాండి జిల్లాలో గబీ నగర్ ప్రాంతంలోని హరీష్ గులాబ్ జామున్స్ దుకాణంలో పంచదార పాకంలో ఎలుక ఈదుతున్న వీడియో వైరల్ కావడంతో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ షాపులో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తదుపరి విచారణ జరిగే వరకు దుకాణాన్ని మూసివేయాలని అధికారులు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, రాష్ట్రంలో అహార భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.