మెస్సీని వెనక్కి నెట్టిన క్రిస్టియానో రొనాల్డో

రిపోర్టర్: సతీష్ స్థలం: World

క్రిస్టియానో రొనాల్డో బాలన్ డి ఆర్ నామినేషన్ల రికార్డులో లయనెల్ మెస్సీ కంటే ముందున్నాడు. రొనాల్డో 18 నామినేషన్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, మెస్సీ 17 నామినేషన్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వరుసగా నాలుగో ఏడాది రొనాల్డో నామినేషన్ జాబితాలో లేనప్పటికీ, అత్యధిక నామినేషన్ల రికార్డు మాత్రం అతని పేరిటే ఉండటం విశేషం.