దేశంలోనే తొలి మహిళా ఏడీసీగా లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి నియామకం

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

భారతీయ త్రివిధ దళాల చరిత్రలో తొలిసారిగా మహిళా అధికారి లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి రాష్ట్రపతికి ఏడీసీగా నియమితులై చారిత్రక రికార్డు సృష్టించారు. హర్యానాకు చెందిన ఆమె 2012లో షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇండియన్ నేవీలో చేరారు. మే 9, 2025న ఆమె అధికారికంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఈ అత్యున్నత బాధ్యతలు స్వీకరించారు.