తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఏపీ జిల్లాలకు రెడ్ అలర్ట్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విశాఖపట్నం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల పన్నెండు గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారి, ఆ తర్వాత తుపానుగా బలపడనుందని స్పష్టం చేశారు. నవంబర్ రెండో తేదీ సాయంత్రానికి ఏపీ తీరం సమీపానికి చేరుకునే ఈ మురసు తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.