ఇద్దరు పిల్లలతో కలిసి రింగ్‌లోకి రావాలనుందన్న రెయ్ మిస్టెరియో
రిపోర్టర్: విజయ్
స్థలం: ఇంటర్నేషనల్
డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ రెయ్ మిస్టెరియో తన కెరీర్ ముగిసేలోపు కుమారుడు డొమినిక్, కూతురు ఆలియాతో కలిసి ఒకే రింగ్‌ను పంచుకోవాలని తన చిరకాల కోరికగా వెల్లడించారు. కూతురు ఆలియా డబ్ల్యూడబ్ల్యూఈ పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న నేపథ్యంలో, చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా తన ఇద్దరు పిల్లలతో కలిసి బరిలోకి దిగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. కుమారుడు డొమినిక్‌తో గతంలో కలిసి పనిచేసిన ఆయన, ఇప్పుడు తన ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించాలనేదే తన అసలు కల అని స్పష్టం చేశారు.