ఎల్నినో ప్రభావం: వరంగల్ జిల్లాలో బతుకమ్మ పూలకు తీవ్ర కొరత

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పూల కోసం మహిళలు పల్లెల్లో వెతుకులాట సాగిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది పూల కొరత తీవ్రంగా ఏర్పడింది. గతంలో వ్యవసాయ భూముల వద్ద సమృద్ధిగా లభించిన తంగేడు, గునుగు తదితర పూలు ఇప్పుడు దొరకడం కష్టంగా మారింది. మార్కెట్లోనూ వీటికి భారీ డిమాండ్ నెలకొంది. దీంతో మహిళలు పూల సేకరణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.